

Shyam singha roy | మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ ఒకటి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. సినిమా డిసెంబర్ 24న విడుదల కానుండగా.. అభిమానులకు నాని మరో బిగ్ ట్రీట్ ఇచ్చాడు. అదే సినిమా ట్రైలర్. శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ అదిరిపోయింది.
ఈ సినిమాలో నాని రెండు పాత్రలు చేస్తున్నాడు. అయితే రెండు పాత్రలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ‘శ్యామ్ సింగరాయ్’ పాత్ర హీరోనా, విలనా అన్నది అర్థం కావడం లేదు. ట్రైలర్‌లో నాని సినిమా అంతా చూపించినట్టే చూపించి.. అనేక ప్రశ్నలను రేకెత్తించాడు. ‘నా పేరు వాసు. డైరెక్టర్‌ని లో-బడ్జెట్’ అన్న డైలాగ్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ‘తప్పని తెలిశాక దేవడినైనా ఎదిరించడంలో తప్పే లేదు’ అనే ఇంటెన్సివ్ డైలాగ్‌తో ముగిసింది.
ట్రైలర్ చూస్తే వాసు, శ్యామ్ సింగరాయ్ ఇద్దరూ రెండు దృవాల వంటి వారని అర్థం అవుతోంది. మరి వారిద్దరిని ఎలా కలిపారన్నది తెలియాలంటే డిసెంబర్ 24 వరకు ఆగాల్సిందే. ఇంత ఇంటెన్స్ ట్రైలర్ మీరు మిస్సయ్యారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..
https://youtu.be/QliDRYaknmI
#Nani #ShyamSinghaRoy #ShyamSinghaRoyTrailer,