

MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట నిలబెట్టుకున్నాడు. చెప్పినట్లే పాకిస్తాన్ క్రికెటర్‌కు ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్ తెలిపారు. పాకిస్థాన్ పేసర్ అసద్ రవూఫ్‌కు ధోనీ తన జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో తెగ సంతోషపడిన రవూఫ్.. తనకు ధోనీ జెర్సీ గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ట్విటర్‌లో షేర్ చేశాడు.
‘ధోనీ నాకు తన ‘7’ నెంబర్ సీఎస్కే జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడు. ధోనీ వ్యక్తిత్వం, కీర్తి వల్ల ఆ జెర్సీకి ఇంకా అభిమానులున్నారు. ఈ గిఫ్ట్ అందుకోవడం సంతోషంగా ఉంది.’ అని రవూఫ్ తన ట్వీటర్లో రాసుకొచ్చాడు.

అంతేకాకుండా.. తనకు ఈ గిఫ్ట్ ధోనీ ఇవ్వడంలో సహకరించిన సీఎస్‌కే టీం మేనేజర్ రసెల్‌కు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రవూఫ్ ట్వీట్‌ను రసెల్ రీట్వీట్ చేశాడు. అలాగే ‘ధోనీ మాటిస్తే నిలబెట్టుకుంటాడు’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక రవూఫ్ ధోనీకి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ధోనీతో కలిసి ఆడే అవకాశం రాకపోయినా రవూఫ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా మహీని కలిశాడు. మ్యాచ్ అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
#AsadRauf #Pakistan #TeamIndin #MSDhoni #CSK