

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడుగా ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా అప్‌డేట్‌ల విషయంలో మూవీ టీమ్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పోస్టర్లు మొదులుకొని గ్లింప్స్, పాటలు అన్నీ కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సోల్ అంథెమ్ ‘జననీ’ విడుదలయింది. రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రికార్డులు చేయడంతో పాటు భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ వీడియో చూసిన్నంత సేపు గూస్ బమ్స్ వచ్చాయనని ప్రేక్షకుడు లేడనడంలో అతిశయోక్తేమీ లేదు. అయితే అప్‌డేట్‌లతోనే సంచలనాలు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రతి అప్‌డేట్ కూడా సినిమాపై అంచనాలను మరింత అధికం చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయిపోయిందని, చివరికి సెన్సార్ కూడా పూర్తి చేసుకొని యూఏ సర్టిఫికెట్ అందుకుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: జై భీమ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న మిస్ ఇండియా బ్యూటీ..?
అంతేకాకుండా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో సెన్సార్ సర్టిఫికెట్ అందుకుందని, కన్నడ, మలయాళంలో కూడా దాదాపు పూర్తయిందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ పెదవి విప్పే వరకు ఆగాల్సిందే.
2 thoughts on “RRR | ఆర్ఆర్ఆర్ ఆ టెస్ట్ కూడా పాస్ అయిందా..?”