Prabhas | ప్రభాస్ పెళ్లికి సిద్దం.. రూ.200 కోట్లతో..??

Prabhas
Prabhas

ప్రస్తుతం బిగెస్ట్ స్టార్ ఎవరంటే అందరి నోటా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే ప్రభాస్. అవును.. ప్రస్తుతం సౌత్ ఏషియాలోనే ప్రభాస్ నెంబర్ వన్ హీరో స్థానంలో ఉన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, పాన్ ఇండియా సినిమాలను వరుసగా చేస్తూ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఎంతటి స్టార్ అయినా అతడి పెళ్లి చర్చ మాత్రం ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించే ప్రభాస్ ఓ ఇంటివాడయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ సర్కిల్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా కాబోయే శ్రీమతికి ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే దాదాపు రూ.120 కోట్లు ఖర్చు పెట్టి నానక్‌రామ్ గూడాలో రెండెకరాల స్థలం కొన్నాడట. అంతేకాదు అందులో రూ.200 కోట్లు ఖర్చుతో రాజభవనం లాంటి ఇల్లు నిర్మిస్తున్నాడని ఫిలింనగర్ కోడైకూస్తోంది.

ఇది కూడా చదవండి: Pooja Hegde | ఇదే నా లాస్ట్ అంటున్న పూజా హెగ్దే.. వీడియో వైరల్..

దాంతో పాటుగా దీనిని ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌గా చెప్పేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని, ఈ వార్త ఇప్పటి వరకు సన్నిహితులకు మాత్రమే చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రభాస్ కుటుంబీకులు సర్వం సిద్దం చేసేశారని, ఇక వధువరులు వచ్చి పెళ్లి పీటలెక్కడమే తరువాయని సమాచారం. ప్రభాస్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. మరి త్వరలో స్వీట్ న్యూస్ ఏమైనా చెప్తాడేమో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం తన పాన్ ఇండియా సినిమాలతో బిజీ లైఫ్ గడుపుతున్నాడు. తాజాగా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్దంగా ఉంది. దాంతో పాటుగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటి తరువాత కూడా వరుస సినిమాలను ఓకే చేసి ఉన్నాడు. వీటిలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా కూడా ఒకటి.

Spread the love

1 thought on “Prabhas | ప్రభాస్ పెళ్లికి సిద్దం.. రూ.200 కోట్లతో..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *