

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే స్టార్ హీరోయిన్‌లకు పోటీ ఇస్తోంది ఉప్పెన బ్యూటీ. తొలి సినిమాతోనే ఉప్పెనలా వచ్చి కుర్రకారు మనసుల్ని దోచేసిందీ ముద్దుగుమ్మ. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటే. రోజురోజుకు కృతిశెట్టికి పెరుగుతున్న ఫాలోయింగ్‌తో మూవీమేకర్స్ క్యూ కడుతున్నారు. కృతి ఇప్పటికే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
అమ్మడు తాజాగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. వాటితో పాటు సుధీర్ బాబు సరసన నటించిన ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అంతేకాకుండా యంగ్ హీరో నితిన్ తాజా సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’, నాగచైతన్యకు జోడీగా ‘బంగార్రాజు’ సినిమాల్లో కృతి నటిస్తోంది. తాజాగా అమ్మడు మరో భారీ బ్యానర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
అంతేకాకుండా ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు ఓ సీనియర్ దర్శకుడు డైరెక్షన్ చేయనున్నాడని, అతడే కృతిని ఒప్పించాడటని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.
krithi shetty, nitin, nani, sudheer babu, naga chaitanya,