

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సక్సెస్ డైరెక్టర్ కొరటాల డైరెక్షన్‌లో సినిమా చేయనున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీజర్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇంతలో పుష్ప రెండు భాగాలని తేలడంతో వారు మొదట షాక్‌కు గురయినా.. నెక్స్ట్ కొరటాలతోనే అని సర్దుకున్నారు. ఇంతలో కొరటాల ఆచార్య తరువాత తాను ఎన్‌టీఆర్‌తో సినిమా చేయనున్నాని బాంబు పేల్చాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొరటాలను ట్రోల్ చేశారు.
అయితే పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన కొరటాల.. బన్నీతో తన సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. బన్నీ పుష్ప2 పూర్తి చేస్తే తనతో సినిమా చేస్తానని కొరటాల చెప్పుకొచ్చాడు. అంతలో తాను ఎన్‌టీఆర్‌తో సినిమాను ముగించుకుంటానని, బన్నీ పుష్ప2 పూర్తి చేసిన వెంటనే తమ కాంబో సినిమా స్టార్ట్ అవుతుందని కొరటాల అన్నాడు. అయితే బన్నీ పుష్ప తర్వాత బోయపాటి సినిమా చేస్తాడా? కొరటాల సినిమా పట్టాలెక్కిస్తాడా? అన్నది మాత్రం ఇంకా తేలలేదు. త్వరలో దీనిపై ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
#KoratalaSiva #AlluArjun #Pushpa #Acharya #NTR