Badminton | బాడ్మింటన్‌లో శ్రీకాంత్ రికార్డు.. మొట్టమొదటి క్రీడాకారుడిగా..

Badminton | భారత బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్

Spread the love
Badminton

Badminton | భారత బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరి శ్రీకాంత్ ఈ ఘనత అందుకున్నాడు. ప్రపంచ బాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు.

టోర్నీలో ప్రీఫైనల్‌లో ఆరోస్థానంలో ఉన్న భారత్‌కే చెందిన యువ క్రీడాకారుడు లక్ష్య సేన్‌ను ఓడించి శ్రీకాంత్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు. వీరి మధ్య 69 నిమిషాల పాటు జరిగిన ఆట అత్యంత ఉత్కంఠగా సాగింది. మొదటి గేమ్ సెట్‌లో శ్రీకాంత్ 17-21తో ఓటమి పాలయ్యాడు.

కానీ ఆ తరువాత రెండు గేమ్ సెట్స్‌లో జూలు విదిలించాడు. వరుసగా 21-14, 21-17తో రెండు గేమ్ సెట్స్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రత్యర్థిని మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్‌కు పతకం పక్కా అని బాడ్మింటన్ అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటికే లక్ష్య సేన్ సెమీ ఫైనల్‌కు చేరినందుకు గాను కాంస్య పతకం అందుకోనున్నాడు.
#Srikanth #Badminton #Record #Lakshya sen

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *