

INDvsSA | సౌత్ ఆఫ్రికాలో టెస్టు, వన్డే సిరీస్ కోసం టీం ఇండియా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రేపటి నుంచి తొలి టెస్ట్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే జట్టులో 5వ నెంబర్లో బ్యాటింగ్ ఎవరు చేస్తారనే విషయంపై జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇటీవల సోషల్ మీడియాలో జట్టు గురించి, సౌత్ ఆఫ్రికాలో టెస్ట్, వన్డే సిరీస్ ల గురించి రాహుల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 5వ నెంబర్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా క్లిష్టమని అన్నాడు.
జట్టులో ఆజింక్య రహానే చాలా విలువైన ఆటగాడాని, శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించగల ఆటగాడాని, ఇక హనుమ విహారి నమ్మదగిన బ్యాటర్ అని చెప్పుకొచ్చాడు.
కాగా.. టెస్టు జట్టు కోసం ప్రకటించిన తుది జట్టులో ఆజింక్య రహానేను ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ. అయ్యర్, విహారీలను పక్కన పెట్టింది.