

Deepika Padukone | బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకొణె పెళ్లి తరువాత కూడా ఫుల్ జోష్ కనబరుస్తోంది. సరికొత్త సినిమా, వెబ్‌సిరీస్‌లను ఓకే చేస్తూ అమ్మడు బిజీగా ఉంది. అయితే దీపిక, రణ్‌వీర్ ఇద్దరూ పెళ్లి తరువాత కలిసి చేసిన తొలి సినిమా ‘83’. భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు 1983 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది
ఇందులో కపిల్ దేవ్ పాత్రతో రణ్‌వీర్ నటించాడు. అతడి భార్య పాత్రలో దీపిక పదుకొణె నటించింది. దీంతో వీరిద్దరి వివాహంతోనే దీపిక పదుకొణెకు ఈ పాత్ర వచ్చిందని బాలీవుడ్ సర్కిల్స్ గుసగుసలు వినిపించాయి. అయితే సినిమా దర్శకుడు కబిర్ ఖాన్ వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కబీర్ ‘83’ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు పంచుకున్నాడు.
ఈ క్రమంలో దీపికపై వస్తున్న వార్తలకు సమాధానమిచ్చాడు. ‘ఈ సినిమా సమయానికి దీపిక-రణ్‌వీర్ పెళ్లి కాకపోయినా ఆ పాత్రకు దీపికనే సెలక్ట్ చేసేవాడిని. దీపికను రణ్‌వీర్ భార్య అనో, పెళ్లి తరువాత వారిద్దరు కలిసి చేస్తున్న తొలి సినిమా అనో ఎంచుకోలేద’ని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. దీంతో ‘83’లో దీపిక పాత్రపై ఉన్న అన్ని సందేహాలు పటాపంచలయ్యాయనే చెప్పుకోవాలి.
#Deepika #KabirKhan #RanveerSingh #83,