Jacqueline Fernandez | హీరోయిన్‌ను పట్టించిన పిల్లి, గుర్రం.. కెరీర్‌కి బ్రేకులు పడ్డట్లేనా..?


Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కానీ అమ్మడు సినిమాలతో కాకుండా మనీ లాండరింగ్ కేసులోని నిందుతుడితో సంబంధంపై అమ్మడు వార్తల్లో నిలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కి సంబంధం ఉందని ఈడీ అనుమానించింది.
దాంతో అతడితో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ అమ్మడు ముందుగా బుకాయించింది. కానీ చంద్రశేఖర్, జాక్వెలిన్ ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫోటో బయటకు రావడంతో వారిద్దరి రిలేషన్ బట్టబయలైంది. దీంతో జాక్వెలిన్‌పై ఈడీ నిఘా మరింత పటిస్టం చేయడంతో పాటు, అమ్మడి గురించి ఆరా తీయడం ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: Sara Ali Khan | అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా.. సారా అలీఖాన్
ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయకొచ్చాయి. జాక్వెలిన్ సుఖేష్ నుంచి బహుమతిగా రూ.10 కోట్లు ఇవ్వడంతో పాటు రూ.50 లక్షల విలువైన గుర్రం, రూ.9 లక్షల ఖరీదైన పర్షియన్ పిల్లిని ఇచ్చాడని ఈడీ తెలుపుతోంది. అంతేకాకుండా సుకేష్ తీహార్ జైల్లో ఉన్నప్పుడు వీరిద్దలు పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని కూడా ఈడీ తెలిపింది.
ఆ తర్వాత సుఖేష్ బెయిల్‌పై బయటకి వచ్చిన వీరిద్దరు ప్రైవేట్ జెట్‌లో చెన్నైకి వెళ్లి అక్కడి ఓ స్టార్ హోటల్‌లో గడిపారని టాక్ నడుస్తోంది. దీంతో అమ్మడి సీనీ కెరీర్‌కి ఇక బ్రేకులు పడ్డాయా అన్న సందేహాలు అభిమానుల్లో వస్తున్నాయి.