

తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక భారతీయ విద్యార్థిని మృత్యువాత పడింది. ఇంటి సీలింగ్‌లో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. కేరళకు చెందిన మరియం సుసాన్ మాథ్యూ వయసు 19 సంవత్సరాలు. ఆమె యూఎస్‌లోని అలబామాలో నివసిస్తోంది. ఎప్పట్లాగే ఇంటికొచ్చిన ఆమె… రాత్రికి పడుకుంది.
ఆ సమయంలో పైఅంతస్తు నుంచి గన్ బుల్లెట్లు ఆమె ఇంటి సీలింగ్‌లో నుంచి దూసుకొచ్చాయి. మంచంపై పడుకొని ఉన్న ఆమెను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమె మరణించింది. న్యాయపరమైన ప్రక్రియను పూర్తిచేసి, మరియం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకెళ్లే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
1 thought on “Indian Origin | ఇంట్లో నిద్రిస్తుండగా దూసుకొచ్చిన బులెట్లు.. అమెరికాలో భారతీయ విద్యార్థిని మృతి”