

బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌లలో సారా అలీఖాన్ పేరు టాప్‌లో ఉంటుంది. అమ్మడు తనదైన నటనతో అందరినీ కట్టిపడేసింది. అయితే అమ్మడు సిరగ్గా మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ‘కేదార్‌నాథ్’సినిమాతో సినీ అరంగేట్రం చేసింది. తన తొలి సినిమాతోనే మంచి పేరు అందుకున్న అమ్మడు ఈ సినిమా విడుదలయ్యి మూడేళ్ల అయిన సందర్బంగా సినిమా జ్ఞపకాలను గుర్తు చేసుకోంది. ఈ క్రమంలో ఈముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇందులో ‘కేదార్‌నాథ్’ అనేది అందరికీ ఒక సినిమానే అయినా తనకు మాత్రం మర్చిపోలేని గొప్ప జ్ఞాకం అని చెప్పుకొచ్చింది.
‘ఈ సినిమాతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. నా కల నేరవేరింది. ఏది ఏమైనా ఈరోజు నేను నా మన్సూర్‌ను మిస్ అవుతున్నాను. ఈ సినిమా గురించి నేను ఇప్పుడు పూర్తిగా చెప్పలేను. కానీ ఆ నాటి ప్రాంతాలు, స్థలం, టీమ్, జ్ఞపకాలు అన్నీ కూడా ఎన్నటికీ మరువలేవి. ముఖ్యంగా సుశాంత్‌తో నటించడం నాకు ఎంతో నేర్పింది. సుశాంత్ కూడా నాకు ఎంతో నేర్పించాడు. అతడు నాకెంతో మద్దుతనిచ్చాడు. సుశాంత్ నిస్వార్థ సహాయం కారణంగానే నేను ఇప్పుడు ఇంతటి నటిగా మీ ముందు ఉన్నాను. ఏది ఏమైనా ఈ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు అందరికీ రుణపడి ఉంటాన’ని సారా రాసుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి అందరినీ ఔరా అనిపించింది.