

Ghani | మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమా చేస్తున్న వరుణ్ ఇటీవల ‘గని’ సినిమా పూర్తి చేసుకున్నాడు. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో వరుణ్ నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ టీజర్‌తో ‘గని’ గట్టి పంచులు విసేరేందుకు సిద్దంగా ఉన్నాడని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తుండగా.. ‘గని’ డిసెంబర్ 24కి మీ ముందుకు రానున్నాడని ప్రకటించారు. అయితే ఇటీవల మేకర్స్ ఇచ్చిన మరో అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి: Tadap | పాయల్‌కి తడప్ హీరోయిన్ సారి.. ఆ సినిమా చేసినందుకే..
‘గని’ డిసెంబర్ 24కి రావడం లేదని తెలిపింది. అయితే అందుకు హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి కారణమని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన పీరియాడికల్ సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా అదే రోజున విడుదల కానుండటంతో ‘గని’ కాస్త ఆలస్యం కానున్నాడని తెలిపింది.
కానీ ‘గని’ ఎప్పుడు వస్తాడన్నది మాత్రం తెలపలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మార్చికి వస్తాడని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మరి ‘గని’ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
1 thought on “Ghani | హైబ్రిడ్ పిల్ల దెబ్బకి వెనక్కి తగ్గిన ‘ఘని’”