

Bigg Boss | 2021లో అందరినీ అలరించిన బిగ్‌బాస్5 షో ముగిసింది. సన్నీని విన్నర్‌గా ప్రకటించాడు బిగ్ బాస్. అయితే షో తరువాత ఫ్యాన్స్ అంతా కొన్ని ఫొటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవి.. షణ్ము్ఖ్, సిరి తమ నిజజీవిత భాగస్వాములతో కనిపించడం. అంటే షన్ను దీప్తిసునైనాతో, సిరి శ్రీహాన్‌తో ఉండే ఫొటోల కోసం, పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
కానీ బిగ్ బాస్ నుంచి వెళ్లి 24 గంటలవుతున్నా షన్ను, సిరీ తమ పార్ట్నర్స్‌ను కలిసినట్లు లేరు. ఇప్పటికే షణ్ముఖ్ తన ఫ్యామీలితో కలిసిన ఫొటోను షేర్ చేసుకున్నాడు. కానీ అందులో దీప్తి సునైనా ఎక్కడా కనిపించలేదు. అదే విధంగా సిరి కూడా తన ఫ్రెండ్స్‌తో వెల్కమ్ బ్యాక్ పార్టీని ప్లాన్ చేస్తూ ఫొటోలు షేర్ చేసింది. ఈ పిక్స్‌లో శ్రీహాన్ లేడు. దీంతో ఫ్యాన్స్ ఈ కపుల్స్ ఫిక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతోంది.
ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. వీరిద్దరు తమ నిజజీవితంలో కూడా కలుస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి. మరి ఈ చర్చలకు షణ్ముఖ్, సిరి బ్రేకులు ఎప్పుడు వేస్తారో చూడాలి.
#Biggboss5 #Shanmukh #Siri,