Megastar Chiranjeevi | భోళా శంకర్ బడ్జెట్ విషయంలో చిరు వెనకడుగు..?


మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత మరొకటిగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తన తదుపరి సినిమా భోళాశంకర్‌ను ప్రారంభించేశాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో చిరు వెనకడుగు వేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌కి బుల్లితెర బ్యూటీ రష్మిని ఓకే చేశారని టాక్ నడుస్తోంది.
అంతేకాకుండా ఇప్పటికే చిరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్, హీరోయిన్‌గా తమన్నా ఇలా చాలా ఖర్చు చేశారని, ఇప్పుడు స్పెషల్ సాంగ్‌కి మరో హీరోయిన్ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని చిరు అభిప్రాయ పడ్డాడట. అందుకే ఎవరైనా చిన్న ఐటమ్ నెంబర్ ఉంటే చూడమని చిరునే సజెస్ట్ చేశాడని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు రష్మీ ఓకే అయినట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.
1 thought on “Megastar Chiranjeevi | భోళా శంకర్ బడ్జెట్ విషయంలో చిరు వెనకడుగు..?”