

INDvsSA | సౌత్ ఆఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ పట్టేయాలనే ఆలోచనలో ఉన్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యేలా ఉన్నాడు.
తొలి టెస్ట్ లో తన మెరుపు బౌలింగ్ తో సఫారీలని ముప్పు తిప్పలు పెట్టి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు బుమ్రా. అలాంటి బౌలర్ రెండో మ్యాచ్ కు దూరం కావడమంటే జట్టుకు పెద్ద షాక్ తినే చెప్పాలి.
ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో ఒక్కసారి కూడా సఫారీలపై సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలిచింది లేదు. అయితే ఈ సారి భారత్ ఆ ఘనతను దక్కించుకునేలా ఉంది.
ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ.. అంటే సోమవారం నుంచి జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.
అయితే ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా జట్టులో ఉండేది, లేనిది అనుమానంగా మారింది. బుమ్రా మడమ గాయంతో బాధపడుతున్నాడని, అందువల్ల అతడికి విరామం ఇచ్చే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి.
ఒకవేళ అదే జరిగితే జట్టులో అతడి స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరనేది ప్రశ్నగా మారింది. మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ లలో ఒకరికి చాన్స్ దకొచ్చు. అయితే బుమ్రా ఏమాత్రం ఫిట్‌గా ఉన్నా అతడికి తుది జట్టులో స్థానం దక్కడం ఖాయం.
#JaspritBumrah #TeamIndia #INDvsSA #2ndTest