

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ అయిందట. భారీ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియా కోడైకూస్తోంది. అయితే బాలకృష్ణ కెరీర్‌లో ‘ఆదిత్య 369’ సినిమా ఎంత ప్రత్యేకమో స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమా సీక్వెల్ కూడా నందమూరి అభిమానుల చిరకాల కోరిక. ఈ సీక్వెల్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని కూడా కొందరు భావిస్తున్నారు. టైమ్ మిషన్ థీమ్‌తో వచ్చి అప్పట్లోనే అదరగొట్టిన సినిమా ‘ఆదిత్య 369’. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఇటీవల ఆయన ఈ సినిమా సీక్వెల్‌పై కూడా పని ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కథను ఆయన పూర్తి చేశారట. కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా రెడీ అయిందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఈ సినిమాను బహుశా ఆయనే డైరెక్ట్ చేయొచ్చని, లేకుంటే ఆయన పర్యవేక్షణలో రూపొందించవచ్చని టాక్ నడుస్తోంది. దాంతో పాటుగా ఈ సీక్వెల్‌లో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి కథ సాగనుందట. ప్రస్తుతం ఆయన ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబో సినిమా ‘ప్రాజెక్ట్ K’కు దర్శక పర్యవేక్షకునిగా వ్యవహరిస్తున్నారు.
ప్రభాస్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ K’ కూడా టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన సినిమాగా ప్రచారమవుతోంది. అయితే ఈ క్రమంలో అభిమానులకు అనేక సందేహాలు వస్తున్నాయి. నందమూరి యువ హీరో మోక్షజ్ఞ తన ఎంట్రీని ప్రభాస్ సినిమాతో ఇస్తున్నాడా అని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా తొలి సినిమాలోనే ప్రభాస్ సరసన నటించే అవకాశం అందుకున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. త్వరలో ఏమైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.
#Balakrishna #Aditya369 #Prabhas #Project