

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్‌లో ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే భారీస్థాయిలో క్రేజ్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎన్నడూ లేని తరహాలో కనిపించనున్నాడు. దానికి తోడుగా జాతీయ స్థాయి దర్శకడు సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయివే వారి నిరీక్షణకు తెరదించుతూ డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూఏ’ సర్జిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా 2 గంటల 59 నిమిషాల నిడివితో అలరించేందుకు సిద్దమవుతోంది.
ఇది కూడా చదవండి: Samantha | ‘ఊ అంటారా’ అంటూ ఊరిస్తున్న సామ్.. పుష్ప సాంగ్ అదుర్స్..
అయితే ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారుల సైతం ఔరా అంటున్నారంట. సినిమాలో ప్రతి పాత్ర కూడా ఎంతో కొత్తగా, ఆసక్తి రేకెత్తించేలా ఉందని, చిత్రం మొదలు నుంచి చివరి వరకు కూడా ప్రతి ప్రేక్షకుడు సీటు అంచుల్లో కూర్చోవడం ఖాయమని అంటున్నారట. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
వీటన్నింటినీ మించి అల్లు అర్జున్ పాత్ర, అందులో అతడు ఒదిగిపోయిన తీరు అత్యధ్భుతంగా ఉందని వారు అంటున్నారట. రష్మిక మందాన కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ సమంత కనిపించే 5 నిమిషాలు కుర్రకారుకి చాలా ప్రత్యేకంగా నిలుస్తాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా అమితంగా అలరిస్తుందని టాక్ నడుస్తోంది. మరి సినిమా అనుకున్న స్థాయిలో అలరిస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 17 వరకు వేచి చూడాల్సిందే.