

టాలీవుడ్‌లో హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్‌డమ్ అందుకున్న హీరో అడవి శేష్. అతడి సినిమాలంటే ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈ క్రమంలోనే అడవి శేష్ కొత్త సినిమా ‘మేజర్’ కోసం అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే శుక్రవారం అడవి శేష్ పుట్టిన రోజు సందర్భంగా అతడి సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది.
ఇది అడవి శేష్ మరో మూవీ ‘హిట్2’ గ్లింప్స్. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇందులో కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ శేష్ కనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్‌లో సీన్స్ చూస్తుంటే సినిమాలో కేస్ చాలా ఇంటెన్స్‌గా సాగనుందని అర్థం అవుతోంది. అంతేకాకండా సినిమాలో యాక్షన్‌కి కూడా కొదవ లేదని అర్థం అవుతోంది. అయితే ఒక్క డైలాగ్ కూడా లేకుండానే అభిమానుల్లో ఆ ఇంటెన్సిటీని కలిగించారు.
అయితే ఈ సినిమా ‘హిట్’కు సీక్వెల్ కాదని, పూర్తిగా వేరని మేకర్స్ చెప్పారు. డిఫరెంట్ స్టోరీతో ఈ థ్రిల్లర్ రూపొందుతుందని వారు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సీట్ అంచుల్లో కూర్చోవడం పక్కా అని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
#Adavi sesh# HIT 2# Major# First glimpse