Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

‘మిమి’లో మహానటి..పక్కానా..?

బాలీవుడ్ మూవీ ‘మిమి’ను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులోనూ ఈ రీమేక్ సినిమాలో మహానటి కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కీర్తీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన అణ్ణాతే, గుడ్ లక్, సఖి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై వస్తున్న వార్తలు అభిమానులకు స్వీట్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఇటీవల ‘మిమి’ రీమేక్ కోసం సంప్రదించగా అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని అమ్మడు తీపి కబురు చెప్తుందేమో చూడాలి.

ఓటీటీలో విడుదలైన ‘మిమి’ సినిమా మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలో కృతి నటన చాలా అద్భుతంగా ఉందని విమర్శకులు కూడా ప్రశంసించారు. అయితే ఇప్పుడు మహానటి కీర్తీ ఏ రేంజ్‌లో నటిస్తుందో అని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. రీమేక్‌లో కీర్తీ చేస్తే ఒరిజినల్‌ను మించి ఉంటుందని అభిమానులు అంటున్నారు. దీనిపై పక్కా అప్‌డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *