T20WC: కప్పు మాదే.. ఎవరూ ఆపలేరు.. ఆ రెండు జట్లతోనే డౌట్..!

T20WC

టీ20 ప్రపంచకప్(T20WC)లో సూపర్ 12 దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పటికే సెమీస్ వెళ్లే జట్లు దాదాపు ఖరారయ్యాయి. గ్రూప్-1లో ఇంగ్లండ్ ఇప్పటికే ఓటమనేదే లేకుండా సెమీస్ చేరింది. ఈ సమయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. ఎవరు ఎంతలా ప్రయత్నించినా ఈ సారి కప్ ఇంగ్లండ్‌దేనని ధీమా వ్యక్తం చేశాడు.
ఎక్కడ ఆడినా, ఏ జట్టుతో ఆడినా విజయం ఇంగ్లండ్‌దే, కప్ తమదే అంటూ ట్వీట్ చేశాడు. 4 మ్యాచ్‌లలో 4 విజయాలతో టాప్ జట్టుగా సెమీస్‌లోకి ఇంగ్లండ్ అడుగుపెట్టిందని, ఆల్ రౌండ్ ప్రదర్శనతో అతరగొడుతోందని తమ జట్టును ప్రశంసించాడు.
అయితే తమ జట్టును ఓడించే సత్తా ఉన్న జట్లు పేర్లు కూడా కెవిన్ ప్రస్తావించాడు. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు మాత్రమే ఇంగ్లండ్‌ను ఓడించేలా ఉన్నాయని, కానీ ప్రస్తుతం తమ జట్టు ఫామ్ చూస్తుంటే ఆ జట్లు గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం తమ జట్టుదేనని అన్నాడు. ‘కేవలం పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించగలవు.
కానీ షార్జాలో ఇది వరకు ఉపయోగించిన పిచ్‌పై మ్యాచ్ ఆడాల్సి ఉంటుంద’ని పీటర్సన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లోని చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్‌పై ఆడిన ఇంగ్లండ్ జట్టు ఎలా కప్పు గెలిచిందే క్రికెట్ జట్టు కూడా అలానే కప్ గెలవాలని ఆకాంక్షించాడు.
ఇదిలా ఉంటే టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో గ్రూపు-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది ఇంగ్లీష్ జట్టు. గ్రూపు -2లో పాకిస్తాన్.. టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్‌లపై విజయాలతో ముందంజలో ఉండగా.. అఫ్గన్ సైతం స్కాట్లాండ్, నమీబియాపై విజయాలతో జోరు మీద ఉంది.
న్యూజిలాండ్ సైతం భారత్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ గ్రూపు నుంచి సెమీస్ చేరే జట్టుతో ఇంగ్లీష్ జట్టు తలపడుతుంది.