

Spot Fixing | క్రికెట్‌ని ఫిక్సింగ్ భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా, క్రికెటర్లు మారుతున్నా ఫిక్సింగ్ చేసే ఆటగాళ్లను, ఫిక్సింగ్ చేయించే బుకీలను నిలువరించడం ప్రపంచ క్రికెట్‌కి సాధ్యం కావడం లేదు. తాజాగా జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ ఫిక్సింగ్‌కి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
తనను ఓ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఫిక్సింగ్ చేయాలని బ్లాక్ మెయిల్ కూడా చేశాడని సంచలన విషయాలు బయటపెట్టాడు.రెండేళ్ల క్రితం ఇండియా వచ్చినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను, ఆ తర్వాత ఎలా బ్లాక్ మెయిలింగ్‌కి గురైంది, ఆ మానసిక వేదనతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, మొత్తం వివరిస్తూ ఓ సుదీర్ష పోస్ట్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.
/origin-imgresizer.eurosport.com/2011/10/20/773231-20926511-2560-1440.jpg?w=640&ssl=1)
ట్వీట్‌లో ఏం చెప్పాడు..?:
‘2019లో ఇండియాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ నన్ను భారత్ రమ్మని పిలిచాడు. స్పాన్సర్‌షిప్ గురించి మాట్లాడాలని, ఇండియా రావాలని పిలిచాడు. అలాగే జింబాబ్వేలో కూడా ఓ టీ20 లీగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. ఇండియా రాను, పోను 15వేల డాలర్లు ఇస్తానన్నాడు.
అప్పటికే జింబాబ్వేలో క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. 6 నెలలుగా మాకు జీతాలు లేవు. దాంతో అంత డబ్బు ఇస్తాననడంతో ఇండియా వెళ్లాను. అతడితో మాట్లాడాను. రేపు తిరిగి జింబాబ్వే వచ్చేస్తానగా.. రాత్రి పార్టీ జరిగింది. అందరూ అక్కడ కొకైన్ తీసుకుంటున్నారు.
ఆ వ్యక్తి నన్ను కూడా క్యాజువల్‌గా తీసుకోమన్నాడు. నేను కూడా తీసుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఉదయాన్నే నేను నిద్ర లేచేసరికి ఆ వ్యక్తితో పాటు మరికొంతమంది నన్ను చుట్టుముట్టారు.
నేను కొకైన్ తీసుకుంటుండగా తీసిన వీడియో చూపించి, తాము చెప్పినట్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని, లేకపోతే ఈ వీడియో బయటపెట్టేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. నా కళ్లముందు జీవితం మొత్తం తలకిందులైనట్లనిపించింది.
నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సరేనన్నాను. అతడు ఇస్తానన్న 15వేల డాలర్లు ఇచ్చాడు. మ్యాచ్ ఫిక్సింగ్ పూర్తయిన తర్వాత మరో 20వేల డాలర్లు ఇస్తానన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఆ డబ్బు తీసుకున్నాను. నేను తిరిగి జింబాబ్వే రావాలి కదా.
ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను మామూలు మనిషిని కాలేకపోయాను. అప్పుడు అనుభవించిన ఒత్తిడి కారణంగా ఎన్నో సమస్యలు ఎదుక్కొన్నాను. ఈ మధ్యనే షింగిల్స్ అనే ఓ వైరల్ వ్యాధి బారిన పడి కోలుకున్నా. అతడి డబ్బు తిరిగివ్వాలని చాలా సార్లు అడిగాడు. నేను ఇవ్వలేకపోయా. ఇవ్వను కూడా. నేను ఆ ఒత్తిడి నుంచి బయపడడానికి 4 నెలలు పట్టింది.

ఆ తర్వాత ఐసీసీకి ఈ విషయం చెప్పా. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో నేను అనుభవించిన బాధ మీతో పంచుకోవాలనిపించింది. నాలా మరే ఆటగాడూ చిక్కుల్లో పడకూడదనే ఆలోచనతోనే ఈ విషయం బయటపెడుతున్నా. కష్ట కాలంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు’ అని ఆ సుదీర్ష పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
అలాగే తాను డబ్బులైతే తీసుకున్నాను కానీ. ఏనాడూ ఫిక్సింగ్ చేయలేదని, తాను ఏలాంటి తప్పైనా చేస్తాను కానీ మోసం మాత్రం చేయనని, అది కూడా తాను ఎంతగానో ప్రేమించే క్రికెట్లో ఎన్నటికీ చేయనని అన్నాడు. ఇక తనపై కొన్నేళ్ల పాటు బ్యాన్ విధించే ఆలోచనలో ఐసీసీ ఉందని తన దృష్టికొచ్చిందని, ఒకవేళ ఐసీసీ తనపై బ్యాన్ విధించినా.. తాను ఆనందంగా స్వీకరిస్తానని టేలర్ తన సుదీర్ష పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
#BrendonTaylor #Cricket #Zimbabwe #ICC #BlackMail #Cocaine #SpotFixing