INDvsSA | సౌత్ ఆఫ్రికాని ఓడించి టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా..?

INDvsSA | భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా. సౌత్ ఆఫ్రికాతో సోమవారం నుంచి

Spread the love
INDvsSA
INDvsSA

INDvsSA | భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా. సౌత్ ఆఫ్రికాతో సోమవారం నుంచి జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ అందుకు వేదిక కానుంది.

ఇప్పటి వరకు సఫారీలని వాళ్ళ సొంత గడ్డపై భారత్ ఏనాడూ ఓడించలేదు. అయితే ఇప్పుడు తొలి టెస్ట్ లో అద్భుత విజహం సాధించిన భారత్.. సౌత్ ఆఫ్రికా జట్టుతో పోల్చితే చాలా పటిష్టంగా ఉంది. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ లో కూడా భారత్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

అంతేకాక రెండో టెస్ట్ జరగబోతున్న జోహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ పిచ్ పై టెస్టుల్లో భారత్ కు ఇప్పటి వరకు ఓటమనేదే లేదు. అలాంటి పిచ్ పై ఈ టెస్ట్ జరగబోతుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అదే రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన భావిస్తోంది.

ఇక ఈ పిచ్ పై టీమిండియా రికార్డులు చూస్తే.. ప్రస్తుత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ 1997లో తన తొలి సెంచరీ ఇక్కడే సాధించాడు. ఆ తర్వాత 2006లో సౌతాఫ్రికాపై తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలుపు కూడా ఈ మైదానంలోనే సాధించింది టీమిండియా. ఇక 2018లో విరాట్ కోహ్లీ కూడా తన ఓవర్‌సీస్ టెస్ట్ విజయాలని ఈ మైదానం నుంచే మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే ఈ పిచ్ భారత జట్టుకు బాగా కలిసొచ్చే పిచ్ గా మారింది. దీంతో ఈ మైదానంలోనే మళ్లీ చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.

మరి అనుకున్నట్లు టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా..? సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకుంటుందా..? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#TeamIndia #INDvsSA #ViratKohli #2ndTest #JohannesBurg

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *