Warner and Puneet | పునీత్‌ని గుర్తుచేసిన వార్నర్.. ఆర్సీబీకి ఆడతాడా?

Warner and Puneet

Warner and Puneet | కొద్ది రోజుల క్రితం మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీర్ రాజ్‌కుమార్‌ని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గుర్తు చేసుకున్నాడు. పునీత్ సినిమాలోని ఓ సీన్‌ను తన ముఖంతో మ్యాష్‌అప్ చేసి రీక్రియేట్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు వార్నర్. ఈ వీడియోకు ‘రెస్పెక్ట్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిపై కన్నడ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వార్నర్‌ను ఆర్సీబీకి ఆడాలని కోరుతున్నారు.
వార్నర్ పోస్ట్ చూసిన కొంతమంది ఫ్యాన్స్.. ‘మా అప్పును మరోసారి గుర్తు చేశారు. మా హృదయాలు బరువెక్కాయి. ధన్యవాదాలు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది.. ఆర్సీబీకి ఆడాలని కోరుతున్నారు. ‘కర్ణాటకకు ఆడతారా? అదే.. ఆర్సీబీలో చేరతారా’ అని అడిగారు. దీనికి వార్నర్ డైరెక్ట్‌గా ఏమీ చెప్పకపోయినా.. ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 జరగబోతోంది. అంతకంటే ముందు ఆటగాళ్ల కాంట్రాక్టులు ఫ్రాంచైజీలతో పూర్తి కావడంతో మెగా వేలం జరగనుంది. ఐపీఎల్ 2021 వరకు ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడిన వార్నర్‌ను ఆ ఫ్రాంచైజీ రిటెన్షన్ చేసుకోలేదు. దీంతో ఈ సారి వేలంలే వార్నర్‌ను ఆర్సీబీ కొనుగోలు చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. వార్నర్ నుంచి కూడా దీనిపై స్పందన రావడంతో వచ్చే సీజన్‌లో వార్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడటం ఖాయమని అభిమానులు మురిసిపోతున్నారు. మరి నిజంగా వార్నర్‌ను ఆర్సీబీ గెలుచుకుంటుందా..? లేదా అనేది తేలాంలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
#PuneetRajKumar #DavidWarner #RCB #Cricket #SRH #IPL2022