Virat Kohli | అవుటైన కోపంలో కోహ్లీ ఏం చేశాడంటే..

Virat Kohli

Virat Kohli | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా ఉంది. ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుతిరగడంతో విరాట్ ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యాడు. అంతేకాకుండా తనను అవుట్‌గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ నిర్ణయంపై కూడా కోహ్లీ అసంతృప్తి ప్రదర్శించాడు.
తొలి టెస్ట్‌కు దూరమైన విరాట్.. ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌కు తిరిగి జట్టులోకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 4 బంతులు మాత్రమే ఆడి డకౌట్‌గా వెనుతిరిగాడు. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు.
బంతి ముందుగా బ్యాట్‌కు తాకిందా..? లేక ప్యాడ్‌కు తాకిందా..? అనే విషయంలో స్పష్టత లేకున్నా అవుట్‌గా ప్రకటించడంపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పెవిలియన్ చేరే సమయంలో.. బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా.. ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన అజాజ్ పటేల్ బౌలింగ్‌లో.. విరాట్ కోహ్లి ఢిపెన్స్ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌తో పాటు ప్యాడ్‌కు కూడా తాకింది. బౌలర్ అజాజ్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు.
కోహ్లీ వెంటనే రివ్యూ కోరాడు. దీనిని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి ముందుగా బ్యాట్‌కు తాకిందా..? లేక ప్యాడ్‌కు తాకిందా..? అనేది నిర్ధారించుకోలేకపోయాడు.
ఎల్బీడబ్ల్యూ విషయంలో మాత్రం బంతి వికెట్లను తాకుతుండడంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే ఫైనల్ చేస్తూ అవుట్ ఇచ్చారు. దీంతో షాక్ అయిన కోహ్లీ డగౌట్‌కు వెళుతూ దారిలో ఉన్న బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కొట్టాడు.
#ViratKohli #TeamIndia #INDvsNZ #DuckOut #ThirdUmpire #Mumbai #WankhadeStadium