World cup | వైరల్: థాయ్‌ల్యాండ్ మహిళా క్రికెటర్ల మొబైల్ వాల్‌పేపర్

World cup | వుమెన్ వరల్డ్ కప్ 2022 క్వాలిఫయర్ టోర్నీ కూడా రద్దు చేసింది ఐసీసీ. ఈ టోర్నీపై ఆశ పెట్టుకున్న థాయ్‌ల్యాండ్ మహిళా క్రికెటర్లకు..

Spread the love
World cup

World cup

World cup

World cup | కోవిడ్ కొత్త వేవ్ బయటపడడంతో మళ్లీ క్రికెట్ టోర్నీలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు ఇత దేశాలతో టోర్నీలను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ఇవన్నీ ఓ ఎత్తయితే. వుమెన్ వరల్డ్ కప్ 2022 క్వాలిఫయర్ టోర్నీ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ.

ఈ నిర్ణయం మహిళా క్రికెట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ టోర్నీపై ఎంతో ఆశ పెట్టుకున్న థాయ్‌ల్యాండ్ మహిళా క్రికెటర్లకు తీవ్ర నిరాశ కలిగినట్లైంది. ఈ క్రమంలోనే ఆ జట్టు క్రికెటర్ల మొబైల్ వాల్‌పేపర్ వైరల్ అవుతోంది. ఆ వాల్‌పేపర్ వారికి ఆటపై ఉన్న ప్రేమను, ప్రపంచకప్‌పై వారు పెట్టుకున్న ఆశలను స్పష్టంగా వివరిస్తోంది.

World cup

మహిళల క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో థాయ్‌ల్యాండ్ జట్టు టాప్ ప్లేస్‌లో ఉంది. కచ్చితంగా ఈ ఏడాది టోర్నీలో తాము ఆడతామని వారంతా ఎంతో ఆశతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా తమ మొబైల్స్‌లో ‘ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022’ లోగోను పెట్టుకున్నారు. ఈ టోర్నీ కోసం న్యూజిల్యాండ్ వెళ్లడానికి అంతా సిద్ధమయ్యారు.

ఇలాంటి సమయంలో మొత్తం క్వాలిఫయర్స్‌ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దీంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఈ క్రమంలోనే వారంతా తమ మొబైల్స్‌లో ఉన్న వాల్‌పైపర్స్‌ను చూపిస్తూ తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఐసీసీ నిర్ణయంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఐసీసీ నిర్ణయం దారుణమని, ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత ఉన్న థాయ్‌ల్యాండ్‌ను దుర్మార్గంగా బయటకు తోసేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *