

T20 world cup | పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న ఈ మెగా టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుంది? ఎవరెవరు తలపడతారు? అనే వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడో కూడా ప్రకటించింది.
2022 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 22న సూపర్ 12 స్టేజ్ మొదలవుతుంది. ఇందులో భారత్ గ్రూప్-2లో ఉంది.
ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, మరో రెండు క్వాలిఫై అయిన దేశాలు ఉంటాయి. ఎప్పటిలానే పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.
అక్టోబర్ 23న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత సౌత్‌ఆఫ్రికాతో అక్టోబర్ 30న, బంగ్లాదేశ్‌తో నవంబర్ 2న భారత్ తలపడుతుంది.
#ICCT20WorldCup #ICCT20WorldCupSchedule #ICC #India #Pakistan