Captain Rohit Sharma | వన్డే కొత్త కెప్టెన్‌గా హిట్‌మ్యాన్

Captain Rohit Sharma
Captain Rohit Sharma | టీమిండియా కొత్త శకం మొదలైంది. కొద్ది రోజుల క్రతం టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తూ.. టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ ట్విటర్ ద్వారా ప్రకటించింది.
‘టీ20లతో పాటు వన్డేలకు కూడా రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇకపై జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతుంది’ అని బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ నుంచే రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే సౌతాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌కు కూడా రోహిత్ కెప్టెన్సీ వహించాల్సి ఉండగా.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా టీ20 సిరీస్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ ఇంతకుముందే ప్రకటించింది.
కాగా.. రెండు రోజుల క్రితం జట్టు కోసం, ఆటగాళ్లు రాణించడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, దానికోసం జట్టు ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నామని, వారిని ఎందుకు తీసేస్తున్నాం..?, ఎందుకు తీసుకుంటున్నాం..? అనే విషయాలను ప్రతి ఆటగాడికీ వివరిస్తే సమస్య రాదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు.
రాహుల్ ద్రవిడ్ ఈ కామెంట్స్ చేసిన రెండు రోజుల్లోనే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి రోహిత్‌కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి నుంచి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ముందుకు సాగనుంది.
అయితే టీ20ల్లో బెస్ట్ కెప్టెన్‌గా పేరున్న రోహిత్ వన్డేల్లో కూడా ఆ పేరును నిలబెట్టుకుంటాడా..? కోహ్లీ కంటే బాగా కెప్టెన్సీ చేస్తాడా..? అనేదితెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
#TeamIndia #RohitSharma #ViratKohli #INDvsSA