అలా చేస్తేనే గెలిచేది.. ఆ జట్టుకు అఫ్రిది సలహా!


Shahid Afridi | పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది బంగ్లాదేశ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారు తమ పరువును కాపాడుకోవాలంటే దేశంలోని క్రికెట్ పిచ్‌లను మెరుగుపరచాలంటూ హిత బోధ చేశాడు. అయితే టీ20 ప్రపంచ కప్ అనంతరం పాకిస్తాన్ బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసందే. ఈ టీ20 టూర్‌లో పాకిస్తాన్ జట్టు వీరవిహారం చేసింది.
బంగ్లాను క్లీన్ స్విప్ చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అఫ్రిది స్పందించాడు. ప్రపంచ స్థాయి క్రికెట్ రాణించాలంటే బంగ్లా తన నాసిరకం పిచ్‌లను మెరుగు పరుచుకోవాలని అన్నాడు. పెద్ద జట్లుగా పెరొందిన ఆస్ట్రేలియా, న్యూజాల్యాండ్‌లను ఇంట చిత్తు చేసిన బంగ్లా టీ20 ప్రపంచ కప్‌లో పాత్రం ఓక్క విజయానికి కూడా నోచుకోలేక పోయందని, అందుకు ఆ దేశ పిచ్‌లే కారణమని అఫ్రిది అన్నాడు.
ఇకనైనా బంగ్లా తన పిచ్‌లను బాగుచేసుకుంటే బలపడే అవకాశాలు ఉన్నాయని హితవు పలికాడు.ఇదిలా ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య నవంబర్ 26 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. వీటిలో మొదటి మ్యాచ్ చత్తోగ్రామ్ వేదికగా జరగనుండగా, రెండో మ్యాచ్ డిసెంబర్ 4న ధాకా వేదిగా జరగనుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం బంగ్లా 16 మంది ప్లేయర్లతో స్క్వాడ్‌ను ప్రకటించింది.