

Rishabh pant | రిషబ్ పంత్‌కి సహనం లేకనే అవుట్ అయిపోయాడని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. సౌత్‌ఆప్రికా-ఇండియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కి ప్రయత్నించి పంత్ అవులయ్యాడు. అయితే ఆ సమయంలో అంత భారీ షాట్ ఆడాల్సిన అవసరం లేదని, కానీ పంత్ అనవసరంగా ఆ షాట్ ప్రయత్నించి, అవుటయ్యాడని గవాస్కర్ అన్నాడు.
ఏ జట్టుకైనా బ్యాటింగ్‌లో నాలుగో నెంబర్ చాలా ముఖ్యమని, అలాంటి స్థానంలో బ్యాటింగ్ చేసేటప్పుడు సహనంగా ఆడాలని, అవసరమైనప్పుడే దూకుడుగా ఆడాలని, కానీ పంత్‌కి ఎప్పుడు సహనంగా ఆడాలో, ఎప్పుడు దూకుడుగా ఆడాలో తెలియదని గవాస్కర్ విమర్శించాడు. దాని కారణంగానే పంత్ అవుటైపోయాడని అన్నాడు.
అంతేకాకుండా.. ఈ ఆటతీరును బట్టి చూస్తే పంత్‌ని నాలుగో స్థానంలో కాకుండా.. 6వ స్థానంలో ఫినిషర్‌లా ఉపయోగించుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు.
‘పంత్ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా గమనించుకోకుండా తన వికెట్ పారేసుకున్నాడు. అందుకే అతడిని అత్యంత ముఖ్యమైన 4వ స్థానంలో కాకుండా 6వ స్థానంలో బ్యాటింగ్‌కి దించితే మంచిది’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్.. 71 బంతుల్లో 85 పరుగులు చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్(55)తో కలిసి 115 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ రాహుల్ అవుటైన కొద్ది సేపటికే లాంగాఫ్‌లో భారీ షాట్ ఆడబోయి అక్కడ మార్‌క్రమ్ చేతికి చిక్కాడు.
#RishabhPant #SunilGavaskar #INDvsSA