

Rishabh pant | టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా గడ్డపై తొలి సెంచరీ కొట్టిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అద్భుతమైన పోరాటం చేశాడు.
ఒకపక్క వికెట్లు వరుసగా పడుతున్నా.. పంత్ మాత్రం అద్భుతంగా ఆడుతూ అజేయ సెంచరీ చేశాడు. చివరి వరకు క్రీజులో పాతుకుపోయి నిలుచుకున్నాడు. దీంతో టీమిండియా 198 పరుగులతో కనీసం గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
కేప్ టౌన్ వేదికగా టీమిండియా-సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 133 బంతుల్లో సెంచరీ బాదేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి సఫారీ గడ్డపై సెంచరీ కొట్టిన వికెట్ కీపర్‌గా చరిత్రలోకెక్కాడు.
ఇదిలా ఉంటే పంత్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో 4 సెంచరీలు కొట్టాడు. అయితే అందులో 3 సెంచరీలు భారత్ బయట కొట్టినవే కావడం విశేషం.
#RishabhPant #TeamIndia #INDvsSA #Century #3rdTest