
Ravichandran Ashwin

Ravichandran Ashwin | టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవించంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనపై వచ్చే కామెంట్స్ గురించి పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు తన జీవితంలో క్రికెట్ మాత్రమే ఉందంటూ చెప్పుకొచ్చాడు.
అశ్విన్ క్రికెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అతడి ఆటపై, మైదానంలో అతడి తీరుపై అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అందులో మన్కడింగ్ వివాదం అతి ముఖ్యమైనది. అలాంటి వివాదాల్లో అశ్వినే అనేక సార్లు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇఫ్పుడు తనపై ఎవరైనా విమర్శలు చేస్తున్నా దాని గురించి పట్టించుకునే స్థాయి దాటేశానని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు.

‘ఆటలో ఎన్నో సార్లు అద్భుతంగా రాణించాను. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఆడేవాడిని. అయితే ఇప్పుడు ఆ స్థాయి దాటేశాననే అనుకుంటున్నా. నా జీవితంలో ఇప్పుడు క్రికెట్ ఓ ప్రధాన భాగం. అందుకే ప్రస్తుతం నన్నెవరైనా ఏమైనా అన్నా పట్టించుకోను. ఆ గోలను పరిగణలోకి తీసుకోవడం మానేశాను’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

కాగా.. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. 38 పరుగులు కూడా చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో ఇప్పటికే ఓ వికెట్ తీశాడు.