Rahul Dravid | తలనొప్పి పెరిగింది.. కోచ్ రాహుల్ షాకింగ్ కామెంట్స్

RahulDravid

Rahul Dravid | జట్టు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిద్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తలనెప్పి పెరిగిందని, కానీ ఇది కూడా బాగానే ఉందని అన్నాడు.
న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అద్భుత విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జట్టు సౌత్ ఆఫ్రికా పయనం కానుంది. అక్కడ టెస్ట్ సిరీస్ ఆడేందకు అవసరమైన జట్టును ఎంపిక చేసే పనిలో ఇప్పుడు సెలెక్షన్ కమిటీ బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలాగే ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా ఆటగాళ్లకు వివరిచడం వల్ల సమస్యలు తలెత్తవు’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా.. టీమిండియా టీ20 కెప్టెన్, టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్ గిల్ పర్వాలేదనిపించాడు.
మయాంక్ అగర్వాల్ తొలి మ్యాచ్‌లో విఫలమైనా.. రెండో మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మిడిలార్డర్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫాం కనబరిచాడు.
ఇక సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాలకు ఆశించినంతగా రాణించలేదు. దీంతో ప్రొటీస్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయబోయే జట్టులో ఎవరుంటారు..? ఎవరిని పక్కన పెడతారు..? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
ఇలాంటి టైంలో ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇదిలా ఉంటే రహానేకు కెప్టెన్ కోహ్లి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
#RahulDravid #TeamIndia #ViratKohli #SouthAfrica #NewZealand