

INDvsSA | టీమిండియాలో నయావాల్ గా పెరు తెచ్చుకున్న చటేశ్వర్ పుజారా కెరీర్ ఇక ముగిసినట్లేనా..? సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ అతడికి ఆఖరిదా..? రెండో టెస్ట్ మ్యాచ్ లో అతడిని తీసేసినట్లేనా..? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులకు కలుగుతున్నాయి.
గత కొద్ది సిరీస్ ల నుంచి పుజారా పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ లతో జరిగిన సిరీస్ లలో రెండంకెల స్కోర్ చేయడానికే నానా అవస్థలు పడ్డాడు.
పూజారాతో పాటు ఆజింక్య రహానే కూడా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సౌత్ ఆఫ్రికా పర్యటన ఆఖరి అవకాశంగా మారింది. అయితే తొలి మ్యాచ్, రెండో ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినా.. తొలి ఇన్నింగ్స్ లో మాత్రం 48 పరుగులతో రహానే పర్వలేదనిపించాడు.
దీంతో అతడికి మరో చాన్స్ దక్కే అవకాశం లేకపోలేదు. అయితే పుజారా మాత్రం రెండు ఇన్నింగ్స్ లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో తొలి బంతికే గోల్డెన్ డక్ గా ఔట్ కావడం అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. అతడి ఫామ్ పై తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే రెండో టెస్ట్ మ్యాచ్ లో అతడిని తొలగించబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కి చోటు కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో న్యూజీలాండ్ తో జరిగిన టెస్ట్
సిరీస్ లో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అయితే రహానే, పూజారాలకు ఆఖరి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయ్యర్ ను పక్కన కూర్చోబెట్టింది జట్టు యాజమాన్యం. కానీ పుజారా ఫామ్ ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్ లో అయ్యర్ కి ఛాన్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరి అయ్యర్ ని తీసుకుంటారో? లేక పూజారాకి మరో ఛాన్స్ ఇస్తారో చూడాలి.
#TeamIndia #INDvsSA #ChateswarPujara #AjinkyaRahane #SreyasIyer