

INDvsSA | సౌత్‌ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఇండియా ఓటమికి, వన్డే సిరీస్‌లో ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్సే కారణమని సౌత్‌ఆఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అన్నాడు.
అటు టెస్ట్ సిరీస్‌లోనే కాకుండా వన్డే సిరీస్‌లో కూడా అన్ని విభాగాల్లోనూ ఇండియానే పైచేయిగా ఉందని, కానీ అతి విశ్వాసం కారణంగా వరుస ఓటములు చవి చూస్తోందని అభిప్రాయపడ్డాడు.
సౌత్‌ఆఫ్రికా-టీమిండియా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలోనే ఇండియా ఓటమిపై తాహిర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

‘ఇండియా ఓటమికి కారణం కచ్చితంగా వాళ్ల అతి విశ్వాసమే. టెస్టులతో పాటు వన్డేల్లోనూ సౌత్‌ఆఫ్రికాతో పోల్చితే ఇండియాదే పైచేయిగా ఉంది. కానీ సౌత్‌ఆఫ్రికా జట్టును తక్కువ అంచనా వేసి వరుస ఓటములను మూటగట్టుకుంది’ అని తాహిర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే మొదట టెస్ట్ సిరీస్‌లో ఊహించని విధంగా ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో ఏకంగా మొదటి రెండు వన్డేల్లోనూ పేలవ ప్రదర్శనతో ఓడిపోయింది.
దీంతో వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. ఆదివారం మూడో వన్డేలో అయినా గెలిచి కనీసం పరువు నిలబెట్టుకుని భారత్ తిరిగి రావాలని జట్టు భావిస్తోంది.
#TeamIndia #INDvsSA #OverConfidence #ImranTahir