
Hassan Ali

Hassan Ali | ఈ మధ్యనే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ చేసిన ఒకే ఒక్క తప్పిదం.. ఆ జట్టుకు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాన్ని దూరం చేసింది.
ఆ తప్పుతో పాకిస్తాన్ ఫ్యాన్స్ అంతా హసన్ అలీపై తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో తప్పు చేసి అంపైర్ ఆగ్రహానికి గురయ్యాడు అలీ.
కోవిడ్ దెబ్బకి క్రికెట్‌లోకి కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఐసీసీ. ఆ నిబంధనల ప్రకారం బౌలర్లు బంతిని షైన్ చేసేందుకు ఉమ్ము, చెమటను వినియోగించకూడదు. 2020 మార్చిలో ఐసీసీ ఈ నిబంధన తీసుకొచ్చింది.
దీనిని ఆటగాళ్లంతా తప్పనిసరిగా అనుసరించాలి. ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే అంపైర్ల చర్యలు తీసుకుంటారు.
కాగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో హసన్ అలీ ఈ రూల్ అతిక్రమించాడు. రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో బంతిని అందుకున్న అలీ.. దానిని ఉమ్మితో శుభ్రం చేశాడు.
అలీ చేసిన ఈ పని కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఫీల్డ్ అంపైర్.. హసన్ అలీ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు.

‘ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని గుర్తులేదా..? ఇంకోసారి ఇదే తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంద’ని వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వెర్నన్ ఫిలాండర్ కూడా హసన్ అలీతో దీనిపై చర్చించడం కెమెరాల్లో రికార్డైంది.
ఇదిలా ఉంటే హసన్ అలీ ఈ మ్యాచ్‌లో ఇలా చేయడం ఇది రెండో సారి.
ఐసీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా ఈ తప్పును రెండు కంటే ఎక్కువసార్లు చేస్తే.. ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించాల్సి ఉంటుంది.
ఇక దీనిపై బంగ్లా అభిమానులు కూడా ట్రోల్స్ మొదలుపెట్టారు.
మ్యాచ్ పూర్తయ్యే లోపు అలీ మూడో సారి కూడా అదే తప్పు చేసేలా ఉన్నాడని, బంగ్లా జట్టుకు 5 పరుగులు ఇచ్చేవరకు అలీ నిద్రపోడంటూ ట్రోల్స్ చేైస్తున్నారు.