

Ind vs NZ | ఒక్కటంటే ఒక్కటే పరుగు. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహ చేసిన స్కోర్ ఇది. రిషబ్ పంత్ స్థానంలో ఆప్షనల్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన సాహ.. తొలి మ్యాచ్‌లోనే బ్యాట్‌తో నిరాశపరిచాడు. దీంతో అతడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా అవుట్ కాగానే క్రీజులోకొచ్చాడు సాహ. మొత్తం 12 బంతులు ఆడి 1 పరుగు మాత్రమే చేశాడు. వచ్చినప్పటి నుంచే కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన సాహా.. 5 ఓవర్లపాటు క్రీజులో ఉన్నాడు. అయితే ఆ తర్వాత సౌథీ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు.
సాహా ఆటతీరుతో ఆగ్రహించిన నెటిజన్స్ సోషల్ మీడియాలో అతడిపై విపరీతంగా మీమ్స్ షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు!’ అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. సాహాను ఇంకా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారు..?’ అని ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. మరో యూజర్.. ‘ఇప్పటికైనా సాహాను పక్కనపెట్టి రిషభ్ పంత్‌ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా!’ అని ట్వీట్ చేశాడు. మరొకరు ‘సాహా ఫామ్‌లో లేడు కదా! బైబై చెప్పేయండి!’ అంటూ ట్రోల్ చేశాడు. ఇంకో యూజర్ అయితే ఏకంగా..‘సాహాను జట్టులో నుంచి వెంటనే పీకి పారేయండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కాగా రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో.. తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది బీసీసీఐ. సాహాకు బదులు అతడిని జట్టులోకి తీసుకోవాలని అనేకమంది ట్వీట్లు చేయడం విశేషం.
1 thought on “IND vs NZ | ‘సాహాని పీకి పారేయండి.. ఇదెక్కడి ఆటరా అయ్యా..!’”