Virat Kohli | ఒక్క ఓవర్ ఆగలేవా కోహ్లీ..? ఎందుకలా చేశావ్..?

VIRATvsAXAR

Virat Kohli | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కోహ్లీ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. ‘ఒక్క ఓవర్ ఆగలేకపోయావా..? ఎందుకలా చేశావ్..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఒకప్పుడు రాహుల్ ద్రవిడ్ చేసిన తప్పే.. ఇప్పుడు కోహ్లీ కూడా చేశాడంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా. ఇన్నింగ్స్ 70వ ఓవర్ ఆఖరి బంతికి జయంత్ యాదవ్ అవుటయ్యాడు.
అప్పటికి అక్షర్ పటేర్ స్కోరు 26 బంతుల్లో 41. స్పిన్నర్లే టార్గెట్‌గా 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో టీ20 ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు అక్షర్.

అయితే జయంత్ అవుటైన వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అక్షర్‌ను వెనక్కి వచ్చేయాలని డ్రెస్సింగ్ రూం నుంచి పిలిచాడు. దీంతో అక్షర్.. హాఫ్ సెంచరీకి కేవలం 9 పరుగులు దూరంలో వెనుతిరగాల్సి వచ్చింది.
అక్షర్ ఆడుతున్న స్పీడ్‌కి మరొక్క ఓవర్ క్రీజులో ఉన్నా అర్థ సెంచరీ పూర్తి చేసేవాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఇలా చేయడం తప్పని, కనీసం అక్షర్ అర్థ సెంచరీ పూర్తయ్యే వరకు ఆగాల్సిందని అంటున్నారు.
అలాగే 2004లో సచిన్ టెండూల్కర్(194) డబుల్ సెంచరీకి అతి చేరువలో ఉన్నప్పుడు ద్రవిడ్ డిక్లేర్ చేసేశాడు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. సచిన్ కూడా అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

ఇక ఇప్పుడు కోహ్లీ కూడా అక్షర్ విషయంలో అలానే ప్రవర్తించాడంటున్నారు నెటిజన్లు.
కనీసం ఒక్క ఓవర్ ఆగిఉన్నా అక్షర్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడని, ఆ మాత్రం కూడా కోహ్లీ ఆగలేకపోయావా..? మూడో రోజే అంత తొందర ఏమొచ్చిందని’ అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.
ఇద్దరిలో ఎవరు అవుటైనా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తానని కోహ్లీ ముందుగానే సంకేతాలిచ్చి ఉంటాడని అంటున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే డిక్లేర్ చేశాడని చెబుతున్నారు.
#VIRATvsAXAR #ViratKohli #AxarPatel #MumbaiTest #NewZealand #TeamIndia