

BBL | ఆస్ట్రేలియన్ క్యాష్ రిచ్ టోర్నీ బిగ్‌బ్యాష్ లీగ్‌లో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డు సృష్టించాడు. బిగ్ బ్యాష్ లీగ్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.
64 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 154 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే బిగ్ బ్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన క్రెయిగ్ సిమన్స్ ఉన్నాడు. సిమన్స్ 2014లో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
మంగళవారం హోబార్ట్ హర్రికేన్స్-మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్.. కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీర విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 273 పరుగులు చేసింది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ పూనకం వచ్చినట్లు హర్రికేన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి బాదుడుకు మెల్బోర్న్ స్టేడియం చిన్నదైపోయింది. మ్యాక్స్‌వెల్‌కి తోడు మార్కస్ స్టోయినిస్ కూడా 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కి దిగిన హర్రికేన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. దీంతో మెల్బోర్న్ ఏకంగా 106 పరుగులు భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
#BBL #GlenMaxwell #HobartHurricanes #MelbourneStars