KL Rahul | అదే నిజమైతే ఏడాది నిషేధం తప్పదా..?

KL Rahul

KL Rahul | టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఏడాది నిషేధం పడబోతోందా..? ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకే అతడిపై బీసీసీఐ ఈ నిషేధం విధించబోతోందా..? అనే ప్రశ్నలు గత కొద్ది కాలంగా క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఐపీఎల్-2021లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ఈ ఏడాది మెగా వేలంలో తనను రిటైన్ చేసుకోవద్దని పీబీఎస్‌కే యాజమాన్యాన్ని కోరాడట. ఈ విషయాన్నా ఆ ఫ్రాంచైజీనే స్వయంగా తెలిపింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. కొత్తగా రాబోయే ఫ్రాంచైజీతో రాహుల్ ముందుగానే అంతర్జగత ఒప్పందం కుదుర్చుకున్నాడని, దాని కారణంగానే అతడు పంజాబ్ కెప్టెన్సీని వదులుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ సారథిగా కొనసాగేందుకు రాహుల్ ఇష్టపడలేదట. ఈ విషయాన్నే తన పంజాబ్ జట్టుకు చెప్పి తనను రిటైన్ చేసుకోవద్దని చెప్పాడట.

అయితే కొత్తగా రాబోయే లక్నో ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకోవడం వల్లే రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే రాహుల్‌పై బీసీసీఐ ఏడాది పాటు నిషేధం విధించే అవకాశం ఉంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంచేసీతోనే ఏ ఆటగాడూ వ్యక్తిగత ఒప్పందాలు చేసుకోకూడదు. కేవలం వేలంలో పాల్గొని తనను గెలుచుకున్న ఫ్రాంచైజీ తరపున మాత్రమే బరిలోకి దిగాలి.
అలా కాకుండా ఎశరైనా ఆటగాడు వేలానికి ముందుగానే ఏదైనా ఫ్రాంచైజీతో ఒప్పందాలు చేసుకోవడం నేరం. అలా ఒప్పందం చేసుకున్న ఆటగాడిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది.
#KLRahul #IPL2022 #PunjabKings #Lucknow #BCCi #Breach