INDvsSA | సౌత్‌ఆఫ్రికాకు టీమిండియా.. మారిన షెడ్యూల్ ఇదే..!

INDvsSA

INDvsSA

INDvsSA

INDvsSA | కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. టీమిండియా-సౌత్ ఆఫ్రికా మధ్య జరగాల్సిన సిరీస్ జరుగుతుందో లేదో అనే అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే సిరీస్ నిర్వ:హిస్తున్నట్లు బీసీసీఐ-క్రికెట్‌ సౌతాఫ్రికాలు ప్రకటించాయి. ఈ సిరీస్‌లలో నిర్వహించే షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించాయి.

టీమిండియా-సౌత్‌ఆఫ్రికా సిరీస్ ముందుగా పేర్కొన్న తేదీల ప్రకారం.. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాలి. కానీ కోవిడ్ దెబ్బకు దీనిని డిసెంబరు 26కు మార్చారు. అలాగే 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌ను కూడా ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ టీ20 సిరీస్‌ను 2022లో నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

INDvsSA

ఈ సిరీస్‌ షెడ్యూల్‌ను క్రికెట్‌ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది.

కొత్త షెడ్యూల్‌:
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ 2021-23లో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌లు:
డిసెంబరు 26-30: సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌- సెంచూరియన్‌
జనవరి 03-07: ఇంపీరియల్‌ వాండరర్స్‌- జొహన్నస్‌బర్గ్‌
జనవరి 11-15: సిక్స్‌ గన్‌ గ్రిల్‌ న్యూలాండ్స్‌- కేప్‌టౌన్‌

వన్డే సిరీస్ షెడ్యూల్‌
జనవరి 19:
యూరోలక్స్‌ బోలాండ్‌ పార్క్‌- పర్ల్‌
జనవరి 21: యూరోలక్స్‌ బోలాండ్‌ పార్క్‌- పర్ల్‌
జనవరి 23: సిక్స్‌ గన్‌ గ్రిల్‌ న్యూలాండ్స్‌- కేప్‌టౌన్‌

కాగా.. కివీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *