

Vitat Kohli | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువతకు ఎప్పటికీ స్ఫూర్తి కాలేడంటూ మాజీ ఆటగాడు గౌతం గంభీర్ సంచలన విమర్శలు చేశాడు. కోహ్లీ ఏ మాత్రం పరిపక్వత లేకుండా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్, రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. అయితే 60/1తో సఫారీలు పటిష్ఠ స్థితిలో ఉన్న సమయంలో అశ్విన్ వేసిన ఓ స్ట్రైట్ బాల్‌ను డీన్ ఎల్గార్ డిఫెన్స్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకకుండా నేరుగా ఎల్గార్ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో టీమిండియా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేసింది.

ఆన్ ఫీల్డ్ అంపైర్ మరియా ఎరాస్మర్ అవుట్‌గా ప్రకటించాడు. కానీ ఎల్గార్ డీఆర్ఎస్ తీసుకోవడంతో.. దీనిని చెక్ చేసిన థర్డ్ అంపైర్ అల్లాహుదియెన్ పాలేకర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టంప్ మైక్ దగ్గరకొచ్చి థర్డ్ అంపైర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ప్రత్యర్థి జట్టుపైనే కాకుండా.. మీ సొంత జట్టుపై కూడా ఫోకస్ పెట్టండి’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక కేఎల్ రాహుల్ కూడా ‘దేశం మొత్తం 11 మందికి వ్యతిరేకంగా ఆడుతోంది’ అంటూ కామెంట్లు చేశాడు. బౌలర్ అశ్విన్ అయితే.. ‘మ్యాచ్ గెలవడానికి వేరే మార్గాలు ఎంచుకోండి’ అని మ్యాచ్ బ్రాడ్ కాస్టర్‌కు చురకలు అంటించాడు.
ఈ కామెంట్స్‌పైనే గంభీర్ స్పందిస్తూ.. కోహ్లీ ప్రవర్తించిన తీరు పరిణితి లేకుండా ఉందని, ఇలా చేస్తే దేశ యువతకు ఎప్పటికీ ఆదర్శవంతమైన ఆటగాడు కాలేడని విమర్శించాడు.
#ViratKohli #GautamGambhir #StumpMike #DeanElgar #RavichandranAshwin #KLRahul #INDvsSA #3rdTest