

National Anthem | సౌత్‌ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి, సిరీస్‌లో వైట్ వాష్ అయినా కలగని బాధ.. జాతీయ గీతం ఆలపించే సమయంలో విరాట్ కోహ్లీ చూయింగ్ గమ్ నమలడంపై వ్యక్తమవుతోంది.
భారత క్రికెట్ అభిమానులు చాలామంది కోహ్లీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘జాతీయ గీతం ఆలపించే సమయంలో చూయింగ్ గమ్ నమిలే నీకు భారత్ తరపున ఆడే అర్హత లేద’ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా కోహ్లీ స్పందించకపోవడంపై ఫ్యాన్స్‌లో మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అనేకమంది నెటిజన్లు కోహ్లీ నిశ్వబ్దంగా ఉండంపై మండిపడుతున్నారు. ‘ఎక్కడో ఉన్న వారి కోసం మోకాళ్లపై నిలబడి మద్దతు తెలిపుతున్నాం. కానీ మన దేశ జాతీయ గీతం ఆలపించడం కంటే చూయింగ్ గమ్ నమలడం ఎక్కువైపోయింది.
కెప్టెన్ అయినా, కాకపోయినా దేశం కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు’ అని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. మరికొంతమంది ‘భారతదేశానికి ప్రాతినిథ్యం వహించే అర్థత నీకుందా..?
భారతదేశ జాతీయ గీతాన్నే నువ్వు గౌరవించలేకపోతే ఇక భారతీయుడివి ఎలా అవుతావు..?’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అలాగే #ChewingGumKohli అనే హ్యాష్ ట్యాగ్‌ని కూడా వైరల్ చేస్తున్నారు.
#Viratkohli #ChewingGum #INDvsSA #3rdODI #NationalAnthem