

Cricket | ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో చేసిన తప్పుకు శిక్షగా భారీ జరిమానా విధించింది. ఏకంగా మొత్తం మ్యాచ్ ఫీజును ఫైన్ రూపంలో తీసుకుంది. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లలో కూడా 5 పాయింట్ల కోత విధించింది.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విషయలో ఆస్ట్రేలియా నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినా.. ఇంగ్లండ్ మాత్రం నిర్థీత సమయంలో తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయింది.
మొత్తం 5 ఓవర్లు తక్కువగా వేయడంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి గానూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఇంగ్లండ్‌కు ఫైన్ విధించాడు. అది కూడా పూర్తి మ్యాచ్ ఫీజును కోత వేయడంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు సంబంధించిన డబ్ల్యూటీసీ పాయింట్లలో కూడా 5 పాయింట్లు కట్ చేశాడు.
#ICC #Ausralia #England #AshesSeries #ENGvsAUS