

Rishab panth | ఉత్కంఠ భరితంగా జరిగిన ఇండియాvsసౌతాఫ్రికా రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో సౌత్ఆఫ్రికా విజయం సాధించింది. రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మెరుస్తాడనుకున్న రిషబ్ పంత్ అందరినీ నిరాశపరిచాడు. వచ్చిన కొద్ది సేపటకే 0 పరుగులతో వెనుదిరిగాడు.
దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిషబ్ పంత్ ఆటపై స్పందించాడు. రిషబ్ పంత్ గేమ్ ఛేంజర్ అన్న ద్రవిడ్ ఇప్పుడు అతడి ఆట తీరుపై చర్చిస్తానన్నాడు.
‘అగ్రెసివ్, పాజిటివ్ ఆటగాడిగా ఉండొద్దని పంత్‌కి ఎవరూ చెప్పరూ. కానీ తన దూకుడు చూపేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాలి. క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కాస్త పరిస్థితులను గమనించుకుంటే మంచిదనేది నా సలహా. క్రీజ్‌లో రిషబ్ టైమింగ్ గురించి ఖచ్చితంగా అతడితో మాట్లాడతాను’ అని ద్రవిడ్ అన్నాడు. అంతేకాకుండా పంత్ మంచి ఆటగాడని కానీ కాస్తంత పదును పెట్టాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు.
#Dravid #INDvsSA #RaishabPant