

Dhoni Not Playing IPL 2022 | కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కెరీర్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మహి ఉంటాడా? ఉండడా? అన్నది బిలియన్ రుపీస్ ప్రశ్నలా మారింది. క్రికెట్ ప్రేమికులు ఇదే హాట్ టాపిక్‌గా చర్చించుకుంటున్నారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్ ఫ్రాంచైజీ మాత్రం ధోనీ నెక్స్ట్ లీగ్ కూడా ఆడతాడు అని చెప్పినా అభిమానుల్లో నమ్మకం కుదరలేదు.
అభిమానుల మదుల్లో ఇంకా అవే సందేహాలు మెదులుతున్నాయి. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ధోని పాల్గొన్నాడు. ఈ సందర్బంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ ఉంటాడా ఉండడా అన్న ప్రశ్నకు మహీ సమాధానం ఇచ్చాడు. ‘దాని గురించి ఆలోచిస్తాను. ఐపీఎల్-2022 వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కదా. చాలా టైమ్ ఉంది. మనం ఇంకా 2021 నవంబర్‌లోనే ఉన్నాం’ అంటూ అభిమానులను మహీ మళ్లీ కన్ఫ్యూజన్‌లో పెట్టాడు.
దీంతో అభిమానుల సందేహాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు ఆగాల్సిందే.