David Warner | వందేళ్లలో ఒకే ఒక్కడు.. కానీ పాపం..!

David Warner

David warner | క్రికెట్లో బ్యాట్స్‌మన్‌కి సెంచరీ అనేది ఓ కల. సెంచరీ చేసి బ్యాట్ పైకెత్తి చూపుతుంటే ఆ ఆనందమే వేరు. అయితే సెంచరీకి కేవలం నాలుగైదు పరుగుల దూరంలో అవుట్ కావడం అంటే అది బ్యాట్స్‌మన్‌కి ఓ రకంగా పీడకలే.
ఇప్పుడు అలాంటి పీడకలలే వరుసగా కంటిన్యూ అవుతుంటే..? ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ పరిస్థితి అలాగే ఉంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2021-22లో వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు మ్యచ్‌లలో భారీ స్కోర్లు చేశాడు. కానీ దురుదృష్టం మాత్రం అతడిని వెంటాడుతోంది. రెండో మ్యాచ్‌లలోనూ సెంచరీకి కొద్ది దూరంలో అవుటైపోయాడు.

గబ్బాలో జరిగిన తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల వద్ద ఔటైన వార్నర్.. ప్రస్తుతం అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో 95 పరుగులకు అవుటయ్యాడు.
తొలి టెస్ట్‌లో గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే రెండో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి 95 పరుగులు చేశాడు. కానీ సెంచరీకి 5 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు.
ఫలితంగా యాషెస్ చరిత్రలో గత వందేళ్లలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీకి చేరువగా వచ్చి తొంబైల్లో ఔటైన తొలి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌గగా వార్నర్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
వార్నర్‌కు ముందు 1921లో టామీ ఆండ్రూస్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో తొంబైల్లో ఔట్ అయ్యాడు. ఇప్పుడా లిస్ట్‌లో వార్నర్ కూడా చేరాడు.
కెరీర్‌లో గడిచిన 159 ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగుల మార్కు దాటాక ఒక్కసారి మాత్రమే ఔటైన వార్నర్.. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా తొంబైల్లోనే అవుట్ కావడంతో అతడి ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.
#DavidWarner #Ashes2021-22 #England #Australia #Testmatch