David Warner | భారతీయ అభిమానికి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్

David Warner | ఆస్ట్రేలియా క్రికెటర్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ భారతీయ అభిమానికి సారీ చెప్పాడు. 27 రోజులుగా వరుసగా ట్విటర్‌లో తనకు

Spread the love
David Warner

David Warner | ఆస్ట్రేలియా క్రికెటర్, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ భారతీయ అభిమానికి సారీ చెప్పాడు. 27 రోజులుగా వరుసగా ట్విటర్‌లో తనకు ట్వీట్ చేస్తుండడంతో.. శుక్రవారం ఎట్టకేలకు వార్నర్ అతడికి రిప్లై ఇచ్చాడు. ‘Sorry, how are you?(క్షమించు, ఎలా ఉన్నావ్)’అని రిప్లై ఇచ్చాడు.

కాగా.. వేదాంత్ హరీష్ అనే ట్విటర్ యూజర్ 27 రోజులుగా ప్రతి రోజూ వార్నర్‌కి ట్వీట్ చేస్తున్నాడు. తనకు వార్నర్ రిప్లై ఇచ్చే వరకు ఇలా ట్వీట్ చేస్తూనే ఉంటానని, అది ఎప్పటివరకైనా సరేనంటూ ఆ యూజర్ తన చివరి ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అలాగే ‘నేను ఎన్ని రోజులు ఇలా ట్వీట్ చేయగలనో అని అనుకుంటున్నావేమో.. నువ్వు రిప్లై ఇచ్చే వరకు ఇలానే ట్వీట్స్ చేస్తూనే ఉంటా’ అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

కాగా.. ఐపీఎల్ కారణంగా విదేశీ ఆటగాళ్లకు కూడా కోట్లమంది భారతీయులు అభిమానులుగా మారారు. ఈ క్రమంలోనే గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన వార్నర్‌కు కోట్లమంది అభిమానులు దేశ వ్యాప్తంగా ఏర్పడ్డారు. వార్నర్‌ను జట్టు నుంచి తొలగిస్తే.. ఏకంగా ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీపైనే వార్ ప్రకటించారు. అలాగే ఇటీవల ఆటగాళ్ల రిటెన్షన్‌లోనూ వార్నర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోని సమయంలో కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా ఆ ఫ్యాన్స్‌లో ఒకరే ఈ వేదాంత్ హరీష్ అనుకుంటా. మరి ఇప్పుడు ఎలాగైతేనేం వార్నర్ నుంచి రిప్లై వచ్చింది కదా. ఇప్పుడు హరీష్ ఏం చేస్తాడో చూడాలి.

#DavidWarner #Cricket #Twitter #Australia

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *