T10 League | వామ్మో ఇదెక్కడి బ్యాటింగ్.. 20 నిముషాల్లోనే..

T10 League

T10 League | బ్యాట్స్‌మన్ బౌండరీలు బాదడం తెలుసు. ఫోర్లు కొట్టడం తెలుసు. అలా విజృంభించి మ్యాచ్‌ను గెలిపించం తెలుసు. కానీ ఎప్పుడైనా బ్యాట్స్‌మన్‌కు పూనకం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? బంతి బంతినీ బౌండరీలు దాటిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా..? బంతి ఎవరు వేస్తున్నారో కూడా తెలీకుండా బౌలర్లందరికీ చుక్కలు చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం.
అబుదాబి టీ20లో భాగంగా శుక్రవారం చెన్నై బ్రేవ్స్, ఢిల్లీ బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్. అబుదాబిలో జరిగే టీ20 లీగ్‌లో చాలాకాలంగా సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి.
తాజాగా ఎవ్వరూ ఊహించని సంచలనం నమోదైంది. టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై బ్రేవ్స్, ఢిల్లీ బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ పెరీరా 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం మొదలైన ఢిల్లీ బుల్స్ ఇన్నింగ్స్ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. బుల్స్ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ శివాలెత్తి బ్యాటింగ్ చేయడంతో.. 81 పరుగుల లక్ష్యం చిన్నదైపోయింది.

కేవలం 4.1 ఓవర్లలో ఢిల్లీ బుల్స్ గెలిచేసింది. ఈ విజయం కోసం ఢిల్లీ ఒక్కవికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
ఇక గుర్బాజ్ కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ చేశాడు. ఇది టి10 లీగ్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నమోదైంది.
మొత్తం 16 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో గుర్బాజ్.. 57 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఇక మరో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ 9 బంతుల్లో 24 పరుగులు చేసి వికెట్ పడకుండా గుర్బాజ్‌కు సహకరించాడు.
కాగా ఈ సీజన్‌లో గుర్బాజ్‌కు ఇది వరుసగా ఐదో అర్థసెంచరీ కావడం విశేషం. టి10 లీగ్ వరుసగా ఐదు అర్థసెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా కూడా గుర్బాజ్ రికార్డు నెలకొల్పాడు.
#T10League #CricketsFastestFormat #Abudabi #Record #DelhiBulls #ChennaiBraves