

BBL | క్రికెట్ లో బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోయిన ఆటగాళ్లను చూశాం, క్యాచ్ పట్టకుండానే పట్టుకున్నట్లు నటించిన ఫీల్డర్లను చూశాం, కావాలని నోబాల్స్ వేసే బౌలర్లను చూశాం, స్లెడ్జింగ్ చేసి అవతలి జట్టు ఆటగాళ్లను ఇబ్బందిపెట్టే ప్లేయర్లనూ చూశాం. కానీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మాత్రం వీటన్నింటికీ మించిపోయాడో బ్యాటర్. చుట్టూ కెమెరాలున్నాయన్న సంగతి మర్చిపోయాడో, ఎవరూ చూడట్లేదనుకున్నాడో కానీ.. అవతలి క్రీజ్ లో బ్యాట్ పెట్టకుండానే రెండో రాన్ కి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన అంపైర్ రన్ రద్దు చేశాడు. ఆ అంతే కాదు బ్యాటర్ కావాలనే ఇలా చేశాడని గుర్తించి.. ఆ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా తొలగించాడు.
బీబీఎల్ లో గురువారం హోబర్ట్ హ్రరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మాక్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే హోబర్ట్ బ్యాటర్ టిమ్ డేవిడ్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ 5వ బంతిని లాంగ్ ఆన్ వైపు కొట్టాడు. వెంటనే 2 పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. అయితే చివరి బంతికి స్ట్రైకింగ్ లో ఉండాలనే ఉద్దేశంతో టిమ్.. అవతలి క్రీజ్ లో బ్యాట్ పెట్టకుండానే రెండో పరుగుకు వెళ్ళిపోయాడు. ఇది గమనించిన అంపైర్.. హోబర్ట్ జట్టుకు 5 పరుగుల ఫైన్ విధించాడు.